గతంలో రాళ్లు వేయించిన జగన్‌.. ఇప్పుడు ఎలా చర్చలు జరిపారు : టీడీపీ నేతలు

గతంలో రాళ్లు వేయించిన జగన్‌.. ఇప్పుడు ఎలా చర్చలు జరిపారు : టీడీపీ నేతలు

పారిశ్రామిక వేత్త ముఖేష్‌ అంబానీతో ఏం చర్చించారో ప్రజలకు చెప్పాలని డిమాండ్‌ చేశారు టీడీపీ నేతలు. అంబానీతో సమావేశంతో.. సీఎం జగన్‌ నిజస్వరూపం తెలిసిపోయిందన్నారు. గతంలో రాళ్లు వేయించిన జగన్‌.. ఇప్పుడు ఎలా చర్చలు జరిపారని ప్రశ్నించారు టీడీపీ నేతలు.

ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేష్‌ అంబానీ సీఎం జగన్‌ ఇంటికి వెళ్లి కలవడంపై ఘాటుగా రియాక్టయ్యారు సీనియర్‌ నేత వర్ల రామయ్య. ముఖేష్‌ అంబానీకి జగన్‌ ఏం బహుమతి ఇచ్చారని ప్రశ్నించారాయన. అడిగే హక్కు ప్రతి ఒక్కరికీ ఉందని, సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందన్నారాయన. సీఎం ఇంట్లో మంత్రాంగం జరుగుతోందని ప్రజలు అనుకునే ప్రమాదం ఉందని.. సమావేశం వివరాలు బయటపెట్టాలని వర్ల రామయ్య డిమాండ్ చేశారు.

ఇక.. పెన్షన్ల విషయంలో వైసీపీ ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు టీడీపీ నేత కళా వెంకట్రావు. అపద్దపు ప్రచారానికి ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారంటూ మండిపడ్డారు. చివరకి హిజ్రాల పెన్షన్లకు కూడా రద్దు చేయడం సిగ్గు చేటన్నారు కళా వెంకట్రావ్‌.

ప్రపంచ శాస్త్రవేత్తలు.. కరోనాకి మందు కనిపెట్టడం పక్కన పెట్టి.. సీఎం జగన్‌కు వచ్చిన జబ్బుకు మందు కనిపెట్టే పనిలో ఉన్నారన్నారు టీడీపీ నేత బుద్దా వెంకన్న. తండ్రిని చంపినవాడని ఆరోపించిన వ్యక్తిని పిలిచి సన్మానం చేశారని, ఈ జబ్బు ఎంటో అర్థం కావడం లేదన్నారు. ఈ ఘటనతోనే సీఎం జగన్‌ నిజ స్వరూపం బయటపడిందన్నారు.

Tags

Next Story