మరోసారి కోర్టును ఆశ్రయించిన నిర్భయదోషి

మరోసారి కోర్టును ఆశ్రయించిన నిర్భయదోషి

నిర్భయ కేసులో దోషుల ఉరికి మంగళవారం ముహూర్తం ఖారారైనా.. శిక్ష నుంచి తప్పించుకోవడానికి వాళ్లు రకరకాల ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. మార్చి 3న ఉరి తీయాలని పాటియాలా హౌస్ కోర్టు తీర్పు ఇవ్వడంతో.. తెల్లారితే శిక్ష అమలు చేయాల్సి వస్తుంది. దీంతో.. తన డెత్‌వారెంట్‌పై స్టే ఇవ్వాలంటూ ఢిల్లీ హైకోర్టులో అక్షయ్ సింగ్ పిటిషన్ వేశాడు. అక్షయ్ సింగ్ పిటిషన్‌పై సోమవారం విచారణ జరగనుంది. మరో దోషి పవన్ గుప్తా సుప్రీం కోర్టులో వేసిన క్యూరేటివ్ పిటిషన్‌పైనా సోమవారం విచారణ జరుగుతుంది. మరణశిక్షను జీవిత ఖైదుగా మార్చాలంటున్న పవన్ గుప్తా జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం విచారిస్తుంది. ఈ కేసులో క్యూరేటివ్ పిటిషన్ వేసిన నాలుగో వ్యక్తి పవన్ గుప్తా కాగా.. ఇప్పటికే ముగ్గురి క్యూరేటివ్ పిటిషన్లు సుప్రీం తిరస్కరించింది. ఇక కోర్టు పరిణామాలు ఏలా ఉంటాయన్నది కాసేపట్లో తెలియనుంది.

Tags

Read MoreRead Less
Next Story