వివాదస్పద వ్యాఖ్యలు చేసి, క్షమాపణలు చెప్పిన ఛార్మి

వివాదస్పద వ్యాఖ్యలు చేసి, క్షమాపణలు చెప్పిన ఛార్మి

ప్రపంచమంతా కరోనా వైరస్‌ దెబ్బకి గజగజ వణికిపోతోంది. అయితే తాజాగా.. దేశ రాజధానితో పాటు తెలంగాణలో కరోనా కేసులు నమోదు కావడంపై ఛార్మి..వివాదస్పద వ్యాఖ్యలు చేసింది. తన ట్విటర్‌ అకౌంట్‌లో కరోనా వైరస్‌కు స్వాగతం అంటూ వ్యాఖ్యలు చేయడం పై పెద్ద దుమారమే రేగుతోంది.

ఛార్మి వీడియోపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జనం ఒక వైపు చస్తుంటే కనీస మానవత్వం లేకుండా కరోనాకు వెల్కమ్ చెబుతావా అంటూ ఆమెపై తిట్ల దండకాన్ని అందుకున్నారు . ఆపదలో ఉన్నవారికి చేతనైతే సాయం చేయాలని, ఇలా చేయకూడదని నెటిజన్లు హితవు పలికారు.

నెటిజన్ల ఆగ్రహంతో తప్పు తెలుసుకున్న ఛార్మి వెంటనే వీడియో డిలీట్ చేసింది. అయితే అప్పటికే నెటిజన్లు ఓ రేంజ్‌లో ఫైర్‌ అవ్వడంతో సమాధానంగా మరో ట్వీట్‌ చేసింది. కరోనాతో ప్రపంచం బెంబేలెత్తిపోతున్న ఈ సందర్భంలో అలాంటి వీడియో పోస్ట్‌ చేయడం తప్పని తెలుసుకున్నానని చెప్పింది. ఇది సున్నితమైన అంశం అని తాను భావించలేకపోయానని వివరణ ఇచ్చింది. తనని క్షమించాలని కోరింది. భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కావు' అంటూ ట్వీట్‌ చేసింది.

Tags

Read MoreRead Less
Next Story