అంకిత్ శర్మ కుటుంబానికి కోటి రూపాయల పరిహారాన్ని ప్రకటించిన కేజ్రీవాల్

అంకిత్ శర్మ కుటుంబానికి కోటి రూపాయల పరిహారాన్ని ప్రకటించిన కేజ్రీవాల్

ఢిల్లీలో జరిగిన హింసాకాండలో మరణించిన ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబి) అధికారి అంకిత్ శర్మ కుటుంబానికి కోటి రూపాయల పరిహారాన్ని ఢిల్లీ ప్రభుత్వం సోమవారం ప్రకటించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ట్విట్టర్ లో ట్వీట్ చేశారు.. అందులో 'అంకిత్ శర్మ ధైర్యవంతుడైన ఐబి అధికారి. అల్లర్లలో అతన్ని దారుణంగా హత్య చేశారు. దేశానికీ ఆయన గర్వకారణం. ప్రభుత్వం అతని కుటుంబానికి అతని కుటుంబ సభ్యులలో ఒకరికి ఉద్యోగం.. అలాగే రూ .1 కోట్ల పరిహారం ఇవ్వాలని నిర్ణయించింది. అతని ఆత్మకు శాంతి చేకూరాలి' అని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ట్విట్టర్‌లో ట్వీట్ చేశారు.

కాగా హింసకు గురైన ఈశాన్య ఢిల్లీలో ఎక్కువగా ప్రభావితమైన ప్రాంతాలలో ఒకటైన చంద్ బాగ్‌లో శర్మ నివసిస్తున్నారు. బుధవారం ఉదయం అతని మృతదేహాన్ని కాలువ నుండి బయటకు తీశారు. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కౌన్సిలర్ తాహిర్ హుస్సేన్ ఈ హత్య చేసినట్లు శర్మ కుటుంబం ఆరోపించిన సంగతి తెలిసిందే.

Tags

Read MoreRead Less
Next Story