ఖమ్మంలో దోపీడి దొంగల బీభత్సం

X
ఖమ్మం నగరం నడిబొడ్డున దారి దోపీడితో దొంగలు బీభత్సం సృష్టించారు. సినిమా తరహాలో కళ్లలో కారం చల్లి భారీ చోరీకి పాల్పడ్డారు. ఖమ్మం రైల్వే మధ్య గేటు ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. విజయవాడ నుండి ఖమ్మంకు బంగారం తీసుకొచ్చే వ్యాపారీ శ్రీపాల్ జైన్పై గుర్తు తెలియని దండగులు కళ్లలో కారం చల్లారు. తరువాత కత్తులతో దాడి చేసి అతడి దగ్గర ఉన్న 600 గ్రాముల బంగారం, లక్ష రూపాయల నగదు, ఇతర వస్తువులు ఎత్తుకెళ్లారు. గోల్డ్ షాప్ అసోసియేషన్ ఫిర్యాదుతో.. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. దుండగుల దాడిలో శ్రీపాల్ జైన్ ఛాతిపై తీవ్ర గాయాలయ్యాయి.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
