తెలంగాణలో బుధవారం నుంచి ఇంటర్‌ పరీక్షలు

తెలంగాణలో బుధవారం నుంచి ఇంటర్‌ పరీక్షలు

తెలంగాణలో బుధవారం నుంచి ఇంటర్‌మీడియట్ పరీక్షలు ప్రారంభం అవుతున్నాయి. ఎక్కడా ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా ఈసారి పకడ్బందీగా ఏర్పాట్లు చేసినట్టు బోర్డ్ అధికారులు చెప్తున్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటలకు పరీక్ష జరుగుతుంది. విద్యార్థులంతా 15 నిమిషాల ముందే పరీక్ష హాల్‌కు చేరుకోవాలి. ఈసారి కూడా నిమిషం నిబంధన కఠినంగా అమలు చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 9 లక్షల 65 వేల మంది విద్యార్థులు ఇంటర్ ఫస్టియర్,సెకండియర్ పరీక్షలు రాస్తున్నారు. ఎగ్జామ్‌కి వచ్చేవాళ్లు ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకురాకూడదు. ప్రతి సెంటర్‌లోనూ 4 సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. గతంలో జరిగిన పొరపాట్లు దృష్టిలో పెట్టుకుని ఈసారి 100 శాతం యాక్యురేట్‌గా ఫలితాలు ప్రకటిస్తామని కూడా అధికారులు చెప్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story