ఆంధ్రప్రదేశ్

గుంటూరు జిల్లాలో రెచ్చిపోయిన వైసీపీ నేతలు

గుంటూరు జిల్లాలో రెచ్చిపోయిన వైసీపీ నేతలు
X

గుంటూరు జిల్లా నర్సారావుపేట మండలం అర్వపల్లిలో.. వైసీపీ నేతలు రెచ్చిపోయారు. పాఠశాల అదనపు గదుల నిర్మాణం పేరుతో 22 ఏళ్లుగా నివాసం వుంటున్న ఇంటిని కూల్చివేశారు. ఇంట్లో సామాగ్రిని పంచాయితీ ఆఫీస్ లో పెట్టి తాళం వేశారు. దీంతో ఇంటి యజమాని 64 ఏళ్ల తిరుమలశెట్టి శివమ్మ అనే వృద్ధురాలు ప్రస్తుతం తన కూతురు ఇంట్లో తలదాచుకుంటోంది.

వైసీపీ నేతల దౌర్జన్యంపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. స్పందనలో భాగంగా బాధితులు నర్సారావుపేట ఆర్డీవో కు ఫిర్యాదు చేశారు. అయినా పట్టించుకోకపోగా.. విషయాన్ని బయటికి చెబితే తీవ్ర ఇబ్బందులు తప్పవని బాధితులను బెదిరిస్తున్నారు.

Next Story

RELATED STORIES