కరీం తుండాను నిర్దోషిగా ప్రకటించిన నాంపల్లి కోర్టు

కరీం తుండాను నిర్దోషిగా ప్రకటించిన నాంపల్లి కోర్టు

1998లో వరుస బాంబు పేలుళ్ల విషయంలో అబ్దుల్ కరీంతుండాను నిర్దోషి అంటూ నాంపల్లి కోర్టు తీర్పునిచ్చింది. ఈ ఒక్క కేసులోనే కాదు అనేక కేసుల్లోనూ పోలీసులు సరైన ఆధారాలు చూపించలేకపోయారు. డిఫెన్స్ వాదనతో ఏకీభవించిన కోర్టు మంగళవారం నాడు తుండాను నిర్దోషిగా నాంపల్లి కోర్టు ప్రకటించింది. గత ఆరేళ్లుగా కొనసాగుతున్న తుండా కేసులో నాంపల్లి కోర్టు కీలక తీర్పును ప్రకటించింది. 1998 వరుస బాంబు పేలుళ్లలో తుండా పాత్ర ఉందనడానికి.. పోలీసులు తగిన ఆధారాలు కోర్టుకు సమర్పించకపోవడంతో అతడిని నిర్దోషిగా ప్రకటించింది కోర్టు. డిఫెన్స్‌ వాదనతో ఏకీభవిస్తూ.. ఆరేళ్లుగా కొనసాగుతున్న తుండా కేసులో కీలక తీర్పు వెలవరించింది. వాస్తవానికి తుండా కేసులో తీర్పును ఫిబ్రవరి 18న వెల్లడించాల్సి ఉంది. ఐతే కేసు విచారణ చేస్తున్న న్యాయమూర్తి సెలవులో ఉండడంతో నాంపల్లి కోర్టుతుది తీర్పును వెలువరించింది.

దేశ వ్యాప్తంగా పలు బాంబు దాడుల్లో తుండా నిందితుడు. 1990లో యువకులను ఉగ్రవాదం వైపు మళ్లించాడు. హైదరాబాద్‌లో జరిగిన పలు పేలుళ్ల కేసులలో తుండా హస్తం ఉంది. పాకిస్తాన్ బంగ్లాదేశ యువకుల్ని ఉగ్రవాదంపై ఆకర్షితుల్ని చేసి శిక్షణ కూడా ఇచ్చాడు కరీమ్ తుండా. 1998లో గణేష్ ఉత్సవాల్లో బాంబ్ బ్లాస్ట్‌కు ప్లాన్ చేశాడన్న అభియోగాలు కూడా ఇతనిపై ఉన్నాయి. ఆయా దాడుల తర్వాత కొన్ని రోజుల పాటు పాకిస్తాన్‌లో తలదాచుకున్నాడు. రెండేళ్ల క్రితం నేపాల్ సరిహద్దుల్లో కరీంను పట్టుకున్నారు ఢిల్లీ పోలీసులు. కరీం తుండా యూపీలోని ఘజియాబాద్ జైలులో ఉన్నాడు. ఐతే 1998 బాంబు పేలుళ్ల కేసులో తుండాకు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో కోర్టు నిర్దోషిగా ప్రకటించింది.

Tags

Read MoreRead Less
Next Story