ఏపీలో ఇంటర్‌ మీడియట్‌ పరీక్షలు.. పరీక్షా కేంద్రాలు గుర్తించడానికి ప్రత్యేక యాప్‌

ఏపీలో ఇంటర్‌ మీడియట్‌ పరీక్షలు.. పరీక్షా కేంద్రాలు గుర్తించడానికి ప్రత్యేక యాప్‌

ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ పరీక్షలు బుధవారం నుంచి జరగనున్నాయి. మార్చి 23 వరకూ జరిగే ఈ ఎగ్జామ్స్.. బుధవారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహిస్తారు. మొత్తం 411 పరీక్షా కేంద్రాల్ని ఏర్పాటు చేశారు. ఇంటర్‌ పరీక్షలకు 10 లక్షల 70వేలమంది విద్యార్థులు హాజరవుతున్నారు. వారిలో జనరల్‌ విద్యార్థులు దాదాపు 10 లక్షల మంది, వొకేషనల్‌ విద్యార్థులు 70వేల మంది ఉన్నారు. విద్యార్థులను పరీక్షా కేంద్రాల్లోకి ఉదయం 8 గంటల నుంచే అనుమతిస్తారు. పరీక్షా కేంద్రాల్లో ఫర్నిఛర్‌, ఇతర మౌలిక వసతులు పూర్తిస్థాయిలో కల్పిస్తారు. మాస్‌ కాపీయింగ్‌ చేయనివ్వకుండా ఫ్లయింగ్‌ స్క్వాడ్స్‌, సిట్టింగ్‌ స్క్వాడ్స్‌ ఏర్పాటు చేశారు. అలాగే పరీక్షా కేంద్రాల దగ్గర 144 సెక్షన్‌ అమల్లో ఉంటుంది. కేంద్రాలకు 100 మీటర్ల దూరంలో ఉన్న అన్ని జిరాక్స్‌ కేంద్రాల్నీ.. పరీక్షలు జరిగే సమయంలో మూసివేస్తారు. సీసీ కెమెరాల నిఘా కూడా ఉంటుంది. విజయవాడ నుంచీ ఆన్‌లైన్‌ ద్వారా సీసీ కెమెరాల్ని పర్యవేక్షించి అవసరమైన సూచనలు చేస్తారు.

పరీక్షా కేంద్రాల్లోకి ఇన్విజిలేటర్లు కూడా సెల్‌ఫొన్స్‌ తీసుకెళ్లకుండా కట్టుదిట్టం చేశారు. కేవలం డిపార్టుమెంట్‌ ఆఫీసర్‌, ఛీప్‌ సూపరింటెండెంట్స్‌ దగ్గర మాత్రమే సెల్‌ఫోన్స్‌ ఉంటాయి. మరోవైపు.. విద్యార్థులు పరీక్షా కేంద్రాలు గుర్తించడానికి ప్రత్యేకంగా యాప్‌ను రెడీ చేశారు. ఇక ఈసారి ప్రిన్సిపల్ సంతకం అవసరం లేకుండానే... ఇంటర్మీడియట్ హాల్ టికెట్స్ జారీ చేస్తోంది. అందువల్ల విద్యార్థులు తమ హాల్ టికెట్‌ను ఇంటర్నెట్ నుంచీ డౌన్‌లోడ్ చేసుకొని... ఎగ్జామ్స్ రాసేయొచ్చు. పరీక్షలు ప్రశాంత వాతావరణంలో బాగా రాసేలా ఇంటర్మీడియట్ బోర్డు జాగ్రత్తలు తీసుకుంది.

Tags

Next Story