డోన్ పోలీస్‌స్టేషన్ వద్ద ఉద్రిక్తత
By - TV5 Telugu |4 March 2020 12:57 PM GMT
కర్నూలు జిల్లా డోన్ పోలీస్‌స్టేషన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. పెళ్లయిన కొన్ని రోజులకే భర్త అదనపు కట్నం కోసం వేధిస్తుండటంతో కావ్య అనే మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో కావ్య భర్త, అతని తండ్రి విచారణకు వచ్చారు. ఆగ్రహానికి గురైన బాధితురాలి బంధువులు పోలీస్‌స్టేషన్ వద్ద ఒక్కసారిగా దాడికి దిగారు. దీంతో పోలీసులు అవాక్కయ్యారు. అప్రమత్తమై పరిస్థితి అదుపులోకి తీసుకొచ్చారు.
Tags
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com