గజ్వేల్ ప్రజలకు ఇదో వరం: హరీష్ రావు

గజ్వేల్ ప్రజలకు ఇదో వరం: హరీష్ రావు

కాళేశ్వరం జలాలు ఈ నెలాఖరులోపు కొండపోచమ్మ జలాశయానికి చేరతాయని మంత్రి హరీశ్‌రావు అన్నారు. గజ్వేల్ ప్రజలకు ఇదో వరం అన్నారాయన. ఎండాకాలంలోను చెరువులు, కుంటలు నింపుతామని.. నాట్లకు రైతులు సిద్ధం కావాలని సూచించారు. కొత్తకుంట చెరువు పునరుద్ధరణ-సుందరీకరణతో వర్గల్ సరస్వతీ దేవి ఆలయానికి వచ్చే భక్తులకు ఎంతో సౌకర్యంగా ఉంటుందని హరీష్‌రావు అన్నారు. కాళేశ్వరం జలాలతో కొత్తకుంట, ఖాన్‌ చెరువు, హల్దీవాగు, చెక్‌డ్యాంలు నిండుతాయని మంత్రి స్పష్టంచేశారు.

Tags

Read MoreRead Less
Next Story