స్త్రీ, పురుషుడు కలిస్తే వివాహం జరిగినట్లే

స్త్రీ, పురుషుడు కలిస్తే వివాహం జరిగినట్లే

స్వలింగ వివాహం నిషేధించే రాజ్యాంగ సవరణను రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ వి. పుతిన్ ప్రతిపాదించారు. ఇందులో భాగంగా స్త్రీ, పురుషుల ఇష్ట ప్రకారం శారీరకంగా కలిస్తే.. అధికారికంగా పెళ్లి జరిగినట్లే అని ఆ దేశ రాజ్యాంగం గుర్తించనుంది. ఈ మేరకు ర‌ష్యా త‌న రాజ్యాంగంలో కొత్త స‌వ‌ర‌ణ తీసుకురానుంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే రాజ్యాంగ సవరణల నేపథ్యంలో దేశ అధ్యక్షుడు వ్లాదిమీర్‌ పుతిన్‌ 24 పేజీల స‌వ‌ర‌ణ‌ల‌ను పార్లమెంట్‌కు స‌మ‌ర్పించారు. స‌మాజంలోని అన్ని వ‌ర్గాల‌తో చ‌ర్చలు జ‌రిపిన త‌ర్వాతే ఈ మార్పుల‌కు శ్రీకారం చుట్టిన‌ట్లు రష్యా తెలిపింది. ఈ సవరణ గనక ఆమోదం పొందితే ఏ దేశంలో లేని వివాహ విధానం రష్యాలో అమల్లోకి వచ్చినట్టవుతుంది.

Tags

Read MoreRead Less
Next Story