కరోనా మాస్క్‌తో డార్లింగ్

కరోనా మాస్క్‌తో డార్లింగ్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హైదరాబాద్ ఎయిర్ పోర్టులో మాస్క్‌తో కనిపించాడు. తెల్లవారు జామున ఎయిర్ పోర్టులో ప్రభాస్ మాస్కుతో కనిపించడంతో తోటి ప్రయాణికులు, సిబ్బంది గుర్తుపట్టి ఆశ్చర్యానికి గురయ్యారు. ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో, ప్రభాస్, పూజా హెగ్డే జంటగా ఓ సినిమా రూపొందుతోంది. ఇటీవలే హైదరాబాద్ షెడ్యూల్ కంప్లీట్ అయింది. తర్వాతి షెడ్యూల్ కోసం మూవీ యూనిట్ యూరప్ బయల్దేరింది.

యూరప్‌ కంట్రీస్‌లో కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తోంది. అందుకే మూవీ యునిట్ జాగ్రత్తలు తీసుకుంది. అందరూ మాస్కులు ధరించారు. ప్రభాస్ మాస్క్ వేసుకుని ఎయిర్‌పోర్ట్ లోపలికి వెళ్తున్నప్పుడు తీసిన ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story