గుర్తు తెలియని వ్యక్తిని ఢీ కొన్న లారీ

గుర్తు తెలియని వ్యక్తిని ఢీ కొన్న లారీ

హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లో రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ కారు కుక్కను తప్పించబోయి అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో కారు డ్రైవర్‌ పరారయ్యాడు. పోలీసులు క్రేన్‌ సాయంతో కారును తొలగించి ట్రాఫిక్‌ను నియంత్రించారు.

అటు.. రాజేంద్రనగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని ఆరాంఘర్‌ చౌరస్తాలో రోడ్డు దాటుతున్న గుర్తు తెలియని వ్యక్తిని లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు.

Tags

Read MoreRead Less
Next Story