రైల్వే స్టేషన్‌లో 6 నెలల పసికందు అదృశ్యం

రైల్వే స్టేషన్‌లో 6 నెలల పసికందు అదృశ్యం

చిత్తూరు జిల్లా రేణిగుంట రైల్వే స్టేషన్‌లో 6 నెలల పసికందు అదృశ్యం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మూడు రోజులు క్రితం బాలుడిని ఓ మహిళ ఎత్తుకెళ్లినట్టు అనుమానిస్తున్నారు. తాడిపత్రికి చెందిన స్వర్ణలతకు.. తన భర్త శివుడుతో కలహాలు ఉన్నాయి. దీంతో ఆమె గత కొంతకాలం కిందట పుట్టింటికి వచ్చింది. కానీ తల్లిదండ్రులతో విబేధాల కారణంగా.. వారం రోజుల నుంచి రైల్వే ఫ్లాట్‌ఫాంపై చంటి బిడ్డతో కలిసి ఉంటోంది. ఇదంతా గమనించిన మరో మహిళ.. ఆమెను పరిచయం చేసుకుంది. మాయమాటలు చెప్పి ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించింది. బయటకు తీసుకెళ్లి భోజనం పెట్టించి.. కొత్త బట్టలు ఇచ్చి.. మార్చుకొని రమ్మని చెప్పింది. ఈ లోపు చంటి బిడ్డను తీసుకొని పరారైంది.

తన బిడ్డను ఎత్తికెళ్లిపోయినట్టు గుర్తించిన స్వర్ణలత రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేసింది. వారు ఆమె ఫిర్యాదును పట్టించుకోకుండా రెండు రోజుల పాటు తిప్పి.. చివరికి రేణిగుంట అర్బన్‌ పోలీసులను కలవని సలహా ఇచ్చారు. దీంతో ఆమె రేణి గుంట పోలీసులు ఆశ్రయించడంతో విషయం వెలుగులోకి వచ్చింది.. కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు బాబును ఎత్తుకెళ్లిన మహిళ కోసం గాలిస్తున్నారు.

Tags

Next Story