జమ్మూ & కాశ్మీర్ లో సోషల్ మీడియా నిషేధం ఎత్తివేత.. 2 జిలో ఇంటర్నెట్ యాక్సెస్
గతేడాది ఆగస్టు 5 న ఆర్టికల్ 370 ను రద్దు చేసినప్పటి నుంచి ఏడు నెలలకు పైగా సోషల్ మీడియా సైట్‌లకు ఉన్న నిషేధాన్ని ఎత్తివేయాలని జమ్మూ కాశ్మీర్ అడ్మినిస్ట్రేషన్ నిర్ణయించింది. 2 జి వేగంతో ప్రజలకు ఇప్పుడు అనియంత్రిత ఇంటర్నెట్ సదుపాయం కల్పించబడుతుందని తెలిపింది. అలాగే జమ్మూ కాశ్మీర్లో యాక్సెస్ చేసే వెబ్‌సైట్ల జాబితాను ప్రభుత్వం అందించింది. ఇది కాకుండా, ల్యాండ్‌లైన్ కనెక్షన్‌లలో కూడా ఇంటర్నెట్ సేవలు అందుబాటులో ఉంటాయి, కాని ధృవీకరణ తరువాతె ఈ అనుమతి ఇస్తారు.
కొత్త ఆర్డర్ "ప్రయోగాత్మక ప్రాతిపదికన" మార్చి 17 వరకు మాత్రమే వర్తిస్తుంది, ఇది "కాశ్మీర్ లోయలో సాధారణ స్థితిని తీసుకువచ్చే దశ" అని వర్గాలు తెలిపాయి. వాస్తవానికి గత ఏడు నెలలుగా, J&K లో చాలా మంది సోషల్ మీడియా సైట్‌లను VPN ఉపయోగించి యాక్సెస్ చేస్తున్నారు. ఈ క్రమంలోప్రిన్సిపల్ సెక్రటరీ (జమ్మూ కాశ్మీర్ ) షలీన్ కబ్రా ఈ రోజు జారీ చేసిన ఉత్తర్వులలో జమ్మూ కాశ్మీర్ అంతటా ప్రజలకు ప్రత్యక్ష ఇంటర్నెట్ సదుపాయం లభిస్తుంది అందులో కొన్ని షరతులు ఉన్నాయి. వాటిలో..
*ఇంటర్నెట్ వేగం 2G కి మాత్రమే పరిమితం చేశారు.
*పోస్ట్-పెయిడ్ సిమ్ ఉన్నవారికి ఇంటర్నెట్ సేవలు, పోస్ట్-పెయిడ్ సిమ్‌ల వినియోగదారులు ధృవీకరణకు తర్వాత మాత్రమే ఇంటర్నెట్‌ను యాక్సెస్ చేయగలరు.
*స్థిర ల్యాండ్‌లైన్ కనెక్షన్‌లలో ఇంటర్నెట్ కనెక్టివిటీ అందుబాటులో ఉంటుంది.
*మునుపటి ఉత్తర్వులో, J&K పరిపాలన 1,600 వెబ్‌సైట్‌లను (ఎక్కువగా విద్య, బ్యాంకింగ్, వ్యాపారం మరియు ప్రభుత్వానికి సంబంధించినది) జాబితా చేసింది, వీటిని J&K లో యాక్సెస్ చేయడానికి అనుమతించారు. ప్రస్తుత ఆర్డర్ ఈ పరిమితిని పక్కన పెట్టింది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com