బడ్జెట్ సమావేశాలపై అసెంబ్లీ హాల్‌లో చర్చలు

బడ్జెట్ సమావేశాలపై అసెంబ్లీ హాల్‌లో చర్చలు
X

ఈనెల 6 నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. దీంతో అసెంబ్లీ హాల్‌లో వివిధ శాఖల అధికారులతో స్పీకర్, మండలి ఛైర్మన్, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి చీఫ్ విప్‌, సీఎస్ సోమేష్ కుమార్‌ తోపాటు డీజీపీ మహేందర్‌రెడ్డి.. హైదరాబాద్, రాచకొండ సీపీలు హాజరయ్యారు. భద్రతా చర్యలతోపాటు ఇతర అంశాలపైనా చర్చించారు.

అధికార యంత్రాంగం సమావేశాలకు సిద్ధంగా ఉండాలని మంత్రి ప్రశాంత్‌రెడ్డి అన్నారు. సమావేశాలను ప్రజలు ఎప్పుడూ గమనిస్తుంటారని.. వారికి జవాబుదారీగా ఉండాలని చెప్పారు. అసెంబ్లీ అధికారుంతా వాట్సాప్ గ్రూపుల ద్వారా ఎప్పటికప్పుడు సమావేశాల తీరుపై సమన్వయం చేసుకోవాలని సూచించారు.

Tags

Next Story