గోవుల దయనీయ స్థితిపై టీవీ5 కథనాలకు స్పందన

గోవుల దయనీయ స్థితిపై టీవీ5 కథనాలకు స్పందన

రాజమహేంద్రవరం శ్రీగౌతమి గోసంరక్షణ సంఘంలోని గోవుల దయనీయ స్థితిపై టీవీ-5 ప్రసారం చేసిన వరుస కథనాలకు స్పందన లభించింది. వందేళ్ల చరిత్ర కలిగిన ఈ గోశాల.. నిధుల లేమితో కొట్టుమిట్టాడుతోంది. దీంతో మూగజీవాల పోషణ భారంగా మారింది. చర్మవ్యాధులు చుట్టుముట్టి ఆరోగ్యం క్షీణిస్తోంది.లింపి స్కిన్ వైరస్ సోకడంతో.. పెద్దపెద్ద పుండ్లు ఏర్పడి గోవుల ఆరోగ్య పరిస్థితి రోజురోజుకూ క్షీణిస్తోంది.

ఈ దయనీయ పరిస్థితిపై టీవీ5 ప్రసారం చేసిన కథనాలకు గోసంరక్షణ నాయకులు స్పందించారు. బీజేపీ ప్రతినిధులతో కలిసి శ్రీగౌతమి గోసంరక్షణ సంఘాన్ని పరిశీలించారు. అక్కడి ఆవుల పరిస్థితిని చూసి చలించిపోయారు. ప్రభుత్వం వెంటనే నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు.

ఉభయ గోదావరి జిల్లాల్లో.. దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న.. ఏకైక గోసంరక్షణ సంఘం ఇది. దీనికి 4.15 ఎకరాలు భూమి ఉండేది. కాలక్రమేణ గోశాల భూములన్నీ ఆక్రమణలకు గురయ్యాయి. దీంతో కేవలం సంఘం మూలనిధిపైనే మనుగడ సాగిస్తోంది. టీవీ5 ప్రసారం చేసిన ఈ కథనంపై స్పందించడం, అటు.. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేయడంతో.. గోసంరక్షణసంఘంలో మార్పు రానుంది.

Tags

Next Story