లోక్‌సభ నుంచి ఏడుగురు కాంగ్రెస్ సభ్యుల సస్పెన్షన్

లోక్‌సభ నుంచి ఏడుగురు కాంగ్రెస్ సభ్యుల సస్పెన్షన్

సభలో వికృత ప్రవర్తనకు పాల్పడ్డారని ఏడుగురు కాంగ్రెస్ ఎంపీలను లోక్‌సభ నుంచి సస్పెండ్ చేశారు స్పీకర్ ఓం బిర్లా. ఏడుగురు కాంగ్రెస్ ఎంపీలలో గౌరవ్ గొగోయ్, రావనీత్ సింగ్ బిట్టు, ఎబే హిండన్ మరియు రమ్య లను ఈ సమావేశాలు ముగిసేంతవరకు సస్పెండ్ చేస్తున్నట్టు ఆదేశాలు జారీ చేశారు. బుధవారం ఎంపీలు కాగితాలను చించి లోక్సభ స్పీకర్ చైర్ వద్ద విసిరారు. దాంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

మరోవైపు ఎంపీల సస్పెన్షన్ పై లోక్‌సభలో కాంగ్రెస్ నాయకుడు, అధీర్ రంజన్ చౌదరి మాట్లాడుతూ, ఇది స్పీకర్ నిర్ణయం కాదు, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. ఈ సస్పెన్షన్‌కు మేము తలొగ్గము. అని అన్నారు. అంతేకాదు "ప్రభుత్వానికి వ్యతిరేకంగా మా పోరాటం పార్లమెంటు లోపల మరియు వెలుపల కొనసాగుతుంది" అని స్పష్టం చేశారు.

Tags

Read MoreRead Less
Next Story