ఆంధ్రప్రదేశ్

ఇసుక రిచ్‌ను ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాస్‌ను అడ్డుకున్న స్థానికులు

ఇసుక రిచ్‌ను ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాస్‌ను అడ్డుకున్న స్థానికులు
X

చిత్తూరు జిల్లా ఆనగళ్లులో ఇసుక రిచ్ ప్రారంభోత్సవం రసాబాసగా మారింది. ఆనగళ్లులో ఇసుక రిచ్ ను ప్రారంభించేందుకు వచ్చిన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాస్ ను గ్రామస్తులు అడ్డుకున్నారు. తమ గ్రామ పరిధిలో ఉన్న ఇసుకను తరలించరాదని.. భూగర్భ జలాలు తగ్గిపోతున్నాయని నిరసన తెలిపారు. ఇసుక రిచ్ ప్రారంభానికి ఏర్పాటు చేసిన పూజా సామగ్రిని గ్రామస్తులు స్వాధీనం చేసుకున్నారు. ట్రాక్టర్ లో ఉన్న ఇసుకను కింద పోశారు. గ్రామస్తుల ఆందోళనతో ఎమ్మెల్యే శ్రీనివాసులు ఇసురిచ్ ప్రారంభించకుండానే అక్కడినుంచి వెళ్లిపోయారు.

Next Story

RELATED STORIES