శ్రీకాకుళం జిల్లాలో కరోనా వైరస్ వదంతులు

తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ కలవరపెడుతోంది. శ్రీకాకుళం జిల్లాలో కరోనా వదంతులు ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నాయి. ఇటీవల దుబాయ్, కువైట్ నుంచి వచ్చిన ముగ్గురు వ్యక్తులకు.. కరోనా వైరస్ లక్షణాలు ఉన్నట్లు వైద్యులు అనుమానిస్తున్నారు. వెల్డర్‌గా పనిచేస్తోన్న నలుగురు.. కొద్ది రోజుల క్రితం స్వగ్రామాలకు వచ్చారు. వీరికి జలుబు, దగ్గు తీవ్రంగా ఉండటంతో సోంపేట ప్రభుత్వాసుపత్రికి స్వచ్ఛందంగా వెళ్లారు. కరోనా వార్తల నేపథ్యంలో.. ముందు జాగ్రత్తగా పరీక్షలు చేయాలని కోరారు. దీంతో వీరిలో ముగ్గురిని శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. బ్లడ్ శాంపిల్స్ సేకరించి.. పూణేకు పంపించారు. వీరికి జ్వరం కానీ, వైరస్ లక్షణాలు కనిపించపోయినప్పటికీ.. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా.. టెస్ట్‌లు నిర్వహిస్తున్నామన్నారు వైద్యులు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com