నిర్భయ దోషులకు ఈనెల 20న ఉరిశిక్ష
నిర్భయ దోషులకు మరోసారి డెత్ వారెంట్ జారీ చేసింది ఢిల్లీ పాటియాలా హౌస్ కోర్టు.. నలుగురు దోషులకు ఈనెల 20న ఉరిశిక్ష అమలు చేయాలనీ ఆదేశాలు జారీ చేసింది. 20వ తేదీ ఉదయం 5 గంటల 30 నిమిషాలకు నలుగురు నిందితులను ఒకేసారి ఉరితీయాలని కోర్టు ఆదేశించింది. నిర్భయ తల్లిదండ్రుల పిటిషన్ పై అదనపు సెషన్స్ జడ్జి ధర్మేంద్ర రానా డెత్ వారెంట్ జారీ చేశారు.
కాగా ఇప్పటికే మూడుసార్లు నిర్భయ దోషుల ఉరి వాయిదా పడింది. నిందితులు తమకున్న న్యాయవకాశాలను అన్నింటిని వినియోగించుకున్నారు. అయినా చట్టపరమైన అడ్డంకులతో మరణశిక్ష మూడుసార్లు పోస్ట్ పోన్ అయింది. తాజాగా ఢిల్లీ పాటియాలా హౌస్ కోర్టు నాలుగోసారి డెత్ వారెంట్ జారీ చేసిన నేపథ్యంలో ఇప్పుడైనా ఉరి అమలవుతుందా? లేక ఇంకేమైనా అడ్డంకులు వస్తాయా అనే సందేహాన్ని ప్రజలు వ్యక్తం చేస్తున్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com