పీఎఫ్ ఖాతాదారులకు షాక్

ఉద్యోగ భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్) డిపాజిట్లపై వడ్డీ రేట్లపై కోత విధించింది. 2019 ఆర్థిక సంవత్సరంలో 8.65 శాతంగా ఉన్న వడ్డీ రేటును 2020 ఆర్థిక సంవత్సరానికి గాను 8.50 శాతానికి తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో 15 బేసిస్ పాయింట్లకు తగ్గించింది ప్రభుత్వం. ఈ విషయాన్నీ కార్మిక మంత్రి సంతోష్ గంగ్వార్ గురువారం వెల్లడించారు.
ఈ రోజు ఢిల్లీలో జరిగిన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీల (సిబిటి) సమావేశంలో 2019-20 సంవత్సరానికి ఈపీఎఫ్ డిపాజిట్లపై 8.5 శాతం వడ్డీ రేటును అందించాలని ఇపిఎఫ్‌ఓ నిర్ణయించిందని సమావేశం అనంతరం విలేకరులతో గంగ్వర్ అన్నారు. తాజా నిర్ణయంతో ఈపీఎఫ్‌వోలోని 60 మిలియన్ల ఖాతాదారులను ప్రభావితం కానున్నారు.
ఇపిఎఫ్‌ఓ తన చందాదారులకు 2016-17 సంవత్సరానికి 8.65 శాతం వడ్డీ రేటును, 2017-18లో 8.55 శాతాన్ని అందించింది. 2015-16లో వడ్డీ రేటు 8.8 శాతంగా ఉంది. 2013-14లో 8.75 శాతం ఇచ్చింది, అలాగే 2014-15లో కూడా ఇంతే ఉంది. 2012-13లో ఇచ్చిన 8.5 శాతం కంటే ఎక్కువ.
© Copyright 2023 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com