బడ్జెట్‌ సమావేశాలకు గవర్నర్‌ను ఆహ్వానించిన కేసీఆర్

బడ్జెట్‌ సమావేశాలకు గవర్నర్‌ను ఆహ్వానించిన కేసీఆర్

రాజ్‌భవన్‌లో గవర్నర్‌ తమిళిసై సౌందర్‌ రాజన్‌తో ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమావేశమయ్యారు. గవర్నర్‌ను బడ్జెట్‌ సమావేశాలకు ఆహ్వానించారు. ఈ నెల 6 నుంచి ప్రారంభం కానున్న సమావేశాల్లో ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్‌ తమిళిసై ప్రసంగించనున్నారు. శుక్రవారం ఉదయం 11 గంటలకు అసెంబ్లీ, శాసనమండలి సమావేశాలు మొదలవుతాయి. ఉభయసభల సంయుక్త సమావేశంలో గవర్నర్‌ ప్రసంగించిన తర్వాత బీఏసీ భేటీ అవుతుంది. సభను ఎన్నిరోజులు నిర్వహించాలనే విషయాన్ని ఆ సమావేశంలో ఖరారుచేస్తారు. అటు రాష్ట్రంలో కలకలం రేపుతున్న కరోనా విషయంలో ప్రభుత్వం తీసుకున్న చర్యలను గవర్నర్‌కు వివరించారు కేసీఆర్.

Tags

Read MoreRead Less
Next Story