ఆర్టీసీ సర్వీసులకు కరోనా ఎఫెక్ట్

విదేశీ ప్రయాణికులతోనే తెలంగాణలో కరోణ భయం పెరిగింది. దీంతో ఎయిర్ పోర్ట్ నుండి వచ్చే ప్రయాణికులను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తరువాతే బయటకు పంపుతున్నారు అధికారులు. ఇక ఎయిర్ పోర్ట్ కు వచ్చి పోయే ఆర్టీసీ సర్వీసుల్లో సైతం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఎయిర్ పోర్ట్ కు ప్రయాణికులను చేరవేసే ఎలక్ట్రీక్ సర్వీసుల్లో క్లీనింగ్ ప్రక్రియ ముమ్మరం చేసారు ఆర్టీసీ అధికారులు.
నిత్యం లక్షలాది మంది ప్రయాణికులను జిల్లాలు, రాష్ట్రాలు దాటిస్తున్న ఆర్టీసీ సర్వీస్‌ల ద్వారా కరోనా సోకకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది యాజమాన్యం. ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేసి డిపోలకు చేరుకున్న సర్వీసులను ప్రత్యేక లిక్విడ్ లతో శుభ్రపరుస్తున్నారు. సర్వీసుల బయట, లోపల కూడా సానిటైజర్ లిక్విడ్ లతో శుభ్రపరుస్తున్నారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

