తెలంగాణ ప్రభుత్వాన్ని అన్ని రాష్ట్రాలు ఫాలో అవ్వాలి: కేంద్రమంత్రి హర్షవర్థన్

తెలంగాణ ప్రభుత్వాన్ని అన్ని రాష్ట్రాలు ఫాలో అవ్వాలి: కేంద్రమంత్రి హర్షవర్థన్

కరోనా వైరస్‌ను నియంత్రించేందుకు తెలంగాణ ప్రభుత్వం చేపడుతోన్న చర్యలను కేంద్ర మంత్రి హర్షవర్ధన్ అభినందించారు. పకడ్బందీ ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారని.. మిగతా రాష్ట్రాలు కూడా తెలంగాణను అనుసరించాలని అన్నారు. కరోనా వైరస్‌పై కేంద్ర మంత్రి హర్షవర్దన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్, స్పెషల్ చీఫ్ సెక్రటరీ శాంతకుమారి, ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ యోగితా రాణా పాల్గొన్నారు. N-95 మాస్కులను అందించాలని కేంద్రాన్ని కోరారు ఈటల. రాష్ట్రంలో మరో కరోనా ల్యాబ్‌ను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.

Tags

Read MoreRead Less
Next Story