రేవంత్‌ని శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో అరెస్ట్‌ చేయలేదు : సైబరాబాద్‌ పోలీసులు

రేవంత్‌ని శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో అరెస్ట్‌ చేయలేదు : సైబరాబాద్‌ పోలీసులు

మల్కాజ్‌గిరి కాంగ్రెస్‌ ఎంపీ రేవంత్‌ రెడ్డి అరెస్టు అయ్యారు. శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో రేవంత్‌ను నార్సింగ్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనుమతి లేకుండా రెండు రోజుల క్రితం మియాఖాన్ గూడ వద్ద డ్రోన్ కెమెరాలు ఉపయోగించినందుకు ఎంపీ రేవంత్‌రెడ్డిపై రంగారెడ్డి జిల్లా నార్సింగి పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. ఎయిర్‌ క్రాఫ్ట్‌ నిబంధనలను ఉల్లంఘించి జిల్లాలోని మియాఖాన్‌గూడ వద్ద డ్రోన్‌ కెమెరాలను వియోగించిన కేసులో రేవంత్‌ను ప్రధాన నిందితుడిగా చేర్చారు. కేటీఆర్ ఫామ్‌హౌస్‌ను డ్రోన్‌తో చిత్రీకరించారని రేవంత్‌పై అభియోగం. ఇప్పటికే నలుగురు రేవంత్‌రెడ్డి అనుచరులను అరెస్ట్‌ చేశారు. రేవంత్ సహా 8 మందిపై నార్సింగ్‌ పీఎస్‌లో కేసు నమోదు చేశారు. ఐపీసీ 184, 187, 11 రెడ్ విత్ 5ఏ, ఎయిర్‌క్రాఫ్ట్‌ యాక్ట్‌ కింద కేసు నమోదయ్యాయి.

రేవంత్‌ని శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో అరెస్ట్‌ చేయలేదని, రేవంత్‌రెడ్డి తనంతట తానే నార్సింగ్‌ పీఎస్‌కు వచ్చారని సైబరాబాద్‌ పోలీసులు తెలిపారు. డ్రోన్‌ కేసులో తనను ఎలా చేరుస్తారంటూ రేవంత్‌ వాగ్వాదానికి దిగారని పోలీసులు చెప్పారు. పోలీసుల వాదనను వినిపించుకోలేదని సైబరాబాద్‌ పోలీసులు పేర్కొన్నారు. రేవంత్‌ పాత్రకు సంబంధించిన ఆధారాలను చూపించామని, పోలీస్‌ విచారణకు ఆయన సహకరించలేదని సైబరాబాద్‌ పోలీసులు స్పష్టం చేశారు. అందువల్లే రేవంత్‌ను అరెస్ట్‌ చేసి కోర్టులో హాజరుపరిచామని సైబరాబాద్‌ పోలీసులు వెల్లడించారు.

Tags

Read MoreRead Less
Next Story