పార్లమెంట్ వెలుపల కాంగ్రెస్ నిరసన

పార్లమెంట్ వెలుపల కాంగ్రెస్ నిరసన

లోక్‌సభ నుంచి తమ పార్టీకి చెందిన ఏడుగురు ఎంపీల సస్పెన్సన్‌తోపాటు.. ఢిల్లీ అల్లర్లపై కాంగ్రెస్‌ నేతలు పార్లమెంటు వెలుపల నిరసనకు దిగారు. కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ ఆధ్వర్యంలో పలువురు ఎంపీలు నల్ల బ్యాండ్‌లు ధరించి నిరసనలో పాల్గొన్నారు. ఢిల్లీకో ఇన్సాఫ్ కరో అంటూ నినాదాలు చేశారు. విపక్షాలను అణగతొక్కడం ఆపేయాలన్నారు. ఢిల్లీ అలర్లపై బాధ్యత వహిస్తూ.. కేంద్ర హోం మంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు కాంగ్రెస్‌ ఎంపీలు.

Tags

Next Story