కరోనా కలకలం.. సాఫ్ట్‌వేర్ కంపెనీల తీరుపై తెలంగాణ సర్కారు సీరియస్‌

కరోనా కలకలం.. సాఫ్ట్‌వేర్ కంపెనీల తీరుపై తెలంగాణ సర్కారు సీరియస్‌

తెలంగాణ రాష్ట్రాన్ని కరోనా భయం వదిలిపెడుతోంది. బాధితుల సంఖ్య పెద్దగా లేకపోవడంతో ప్రజలు, ప్రభుత్వం ఊపిరి పీల్చుకుంటున్నాయి. ఇప్పటి వరకు కేవలం ఒకే ఒక్క కరోనా వైరస్ నమోదైంది. కరోనా లక్షణాలతో ఆస్పత్రి లో చేరినవాళ్లు, అనుమానితు ల్లో ఎవ్వరికి పాజిటివ్ రాలేదు. మైండ్‌స్పేస్‌ ఐటీ ఉద్యోగిలో కూడా కరోనా నెగెటివ్ రిపోర్టు వచ్చింది. మరో మహిళకు కూడా కరోనా సోకలేదని నిర్దారణ అయ్యింది. రాష్ట్రానికి చెందిన వ్యక్తుల్లో ఎవ్వరికి కరో నా లేదని ప్రభుత్వం స్ఫష్టం చేసింది. ఇతర దేశాల నుంచి వచ్చినవారిలో ఒక్కరికి మాత్రమే కరోనా సోకిందని, అత ను కూడా కోలుకుంటున్నాడని వివరణ ఇచ్చింది. తప్పుడు వార్తలు, అసత్య ప్రచారాలతో ప్రజలను ఆందోళనకు గు రి చేయవద్దని విజ్ణప్తి చేసింది.

రాష్ట్రంలో కరోనా నిర్దారణకు తెలంగాణ ప్రభుత్వం ఆరుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేసింది. వైరాలజీ ల్యాబ్, మైక్రో బయాలజీ హెచ్‌ఓడీలు ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. అలాగే, ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులకు మార్గద ర్శకాలు జారీ చేశారు. ప్రతి ఆస్పత్రిలో కరోనాపై అవగాహన కోసం కరపత్రాలు, బోర్డులు ఏర్పాటు చేయాలని సూచిం చారు. ఫ్లూ లక్షణాలున్న వాళ్లను ఇతరులతో కలవనివ్వొద్దని, వారికి ప్రత్యేకంగా కౌంటర్లు ఏర్పాటు చేయాలని ఆదే శించారు. విదేశీ పర్యాటకుల వివరాలను డాక్యుమెంట్ రూపంలో భద్రపరచాలని పేర్కొంది. కరోనా అనుమానితుల శాంపిల్ సేకరణ ప్రొటోకాల్ ప్రకారమే జరగాలని, కేంద్రం గైడ్‌లైన్స్‌ కచ్చితంగా పాటించాలని స్పష్టం చేసింది.

ఇంటర్మీడియెట్ పరీక్షల విషయంలోనూ ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంది. పరీక్షల నిర్వహణ నిబంధ నల్లో కొద్దిగా మార్పులు చేశారు. విద్యార్థులు మాస్క్‌లు ధరించి పరీక్షలు రాయడానికి అనుమతి ఇచ్చారు. సొంతంగా వాటర్ బాటిల్‌ తెచ్చుకోవడానికి పర్మిషన్ ఇచ్చారు. జ్వరం, దగ్గు, జలుబుతో బాధపడుతున్న విద్యార్థులను మరో గదిలో కూర్చోబెట్టి పరీక్షలు రాయించాలని సూచించారు.

సాఫ్ట్‌వేర్ కంపెనీల తీరుపై తెలంగాణ సర్కారు సీరియస్‌గా స్పందించింది. ప్రభుత్వం నుంచి ముందస్తు అనుమతి లేకుండా వర్క్ ఫ్రమ్ హోమ్ అనుమతి ఇవ్వద్దని స్పష్టం చేసింది. ఒక ఐటీ ఉద్యోగికి కరోనా సోకిందని అనుమానం రావడంతో రహేజా మైండ్‌స్పేస్‌ సెజ్‌లో అలజడి చెలరేగింది. ఐబీఎం, కాగ్ని జెంట్, ఇంటెల్ తదితర కంపెనీలు వర్క్‌ ఫ్రమ్ హోమ్‌కు ఆదేశించాయి. మొత్తం 11 వేల మంది ఇళ్లకు వెళ్లిపోవడంతో ఐటీ కారిడార్ బోసిపోయింది. ఐతే, ఐటీ ఉద్యోగికి కరోనా సోకిందని అధికారికంగా నిర్దారణ కాకపోయినప్పటికీ ఐటీ కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్‌కు ఆదేశించడాన్ని ప్రభుత్వం తప్పుపట్టింది.

ఇక, సికింద్రాబాద్ మహేంద్రహిల్స్‌లో ఇంకా టెన్షన్ వాతావరణం తొలగిపోలేదు. కాలనీకి చెందిన ఓ ఐటీ ఉద్యోగికి కరోనా సోకిందనే అనుమానంతో స్థానికులు భయపడుతున్నారు. అతనితో పాటు అతని కుటుంబసభ్యులకు కరోనా లేదని ప్రభుత్వం చెప్పినప్పటికీ వారిలో ఆందోళన తొలగిపోలేదు. బాధితుని వద్దకు కొందరు వెళ్లి వస్తున్నారని, వారి ద్వారా ఇంకెవరికైనా వైరస్ సోకే ప్రమాదముందని టెన్షన్ పడుతున్నారు. వాళ్లను ఇతరులతో కలవనివ్వకుండా చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఇక, ఆంధ్రప్రదేశ్‌లో కరోనా భయం కమ్మేస్తోంది. చిన్న అనుమానం వస్తే చాలు కరోనా సోకిందేమే అని వణికిపోతు న్నారు. దగ్గినా, తుమ్మినా, జలుబు వచ్చినా ఆస్పత్రికి వెళ్లి చెకప్ చేయించుకుంటున్నా రు. రాష్ట్రవ్యాప్తంగా వందల మంది కరోనా అనుమానంతో టెస్టులకు వెళ్తున్నారు. వైరస్ లేదని తెలిస్తేనే ప్రశాంతంగా ఉంటున్నారు. ముందు జాగ్రత్తగా మాస్క్‌లు ధరిస్తున్నారు.

ఏపీ ప్రభుత్వం కూడా కట్టుదిట్టంగా వ్యవహరిస్తోంది. రాష్ట్ర-జిల్లా స్థాయిలలో 24/7 కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేశారు. ప్రతి జిల్లాలోని బోధన, జిల్లా ఆస్పత్రుల్లో ఐసోలేషన్ వార్డులు ఏర్పాటయ్యాయి. వైరస్ ప్రభావిత దేశాల నుంచి వచ్చిన 330 మంది ప్రయాణికులను అబ్సర్వేషన్‌లో పెట్టారు. అందులో 102 మందికి వారి ఇళ్లలోనే వైద్య పరిశీలనలో ఉంచారు. మిగిలిన 216 మందిలో 23 మంది శాంపిల్స్ సేకరించి ల్యాబ్‌కు పంపించగా.. 11 శాంపిల్స్ నెగిటివ్‌గా నిర్ధారణ అయ్యాయి. వైరస్‌ను ఎదుర్కోవడానికి నివారణ, నియంత్రణ చర్యలు తీసుకుంటున్నామని, ప్రజలు ఆందోళన చెందవద్దని ప్రభుత్వం సూచించింది.

Tags

Read MoreRead Less
Next Story