మంగళగిరి మండలం ఎర్రబాలెంలో రైతుల ఆందోళన

మంగళగిరి మండలం ఎర్రబాలెంలో రైతుల ఆందోళన
X

మంగళగిరి మండలం ఎర్రబాలెం రైతులు ఆందోళనకు దిగారు. తాము రాజధానికి ఇచ్చిన భూముల్లో పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తుండడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. CRDA సిబ్బంది భూమి కొలతలు తీసుకునేందుకు ఎర్రబాలెం వస్తున్నారని తెలిసి పురుగుల మందు డబ్బాలతో పొలాల వద్దకు వెళ్లారు. తమ పొలాలను ఎవరికో ఇళ్లపట్టాలకు ఇచ్చేందుకు తాము సిద్ధంగా లేమని, అవసరమైతే ప్రాణాలైనా అర్పిస్తాం తప్ప రాజధాని వదులుకోబోమని స్పష్టం చేశారు. తాము పేదల ఇళ్లపట్టాలకు వ్యతిరేకం కాదని, రాజధాని ఇక్కడే ఉంచి అభివృద్ధి చేస్తూ ఎవరికైనా ఏమైనా ఇవ్వొచ్చని అన్నారు.

Next Story