రాజన్న సిరిసిల్లలో వ్యక్తి ఆత్మహత్య .. బ్యాగులో కొబ్బరికాయలు, నిమ్మకాయలు

రాజన్న సిరిసిల్లలో వ్యక్తి ఆత్మహత్య .. బ్యాగులో కొబ్బరికాయలు, నిమ్మకాయలు

రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య స్థానికంగా కలకలం రేపింది. బైక్‌పై వచ్చిన ఓ వ్యక్తి.. అంబేద్కర్‌ చౌక్‌ వద్ద పెట్రోల్‌ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మంటల్లో కాలిపోతున్న ఆ వ్యక్తిని రక్షించేందుకు స్థానికులు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. నిత్యం రద్దీగా ఉండే అంబేద్కర్‌ వద్ద వ్యక్తి ఆత్మహత్యతో అక్కడి వారంతా ఉలిక్కిపడ్డారు. సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు. ఎవరా వ్యక్తి.. ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు అనే కోణంలో విచారణ చేపట్టారు. చనిపోయిన వ్యక్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. అయితే అతను వెంట తీసుకొచ్చిన బ్యాగులో కొబ్బరికాయలు, నిమ్మకాయలు ఉండడంతో పలు అనుమానాలకు తావిస్తోంది. మొత్తానికి ఈ ఘటనతో పట్టణ వాసులు ఆందోళనకు గురయ్యారు.

Tags

Read MoreRead Less
Next Story