ఏపీ రాజ్యసభ ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదల

ఏపీ రాజ్యసభ ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదల

ఆంధ్రప్రదేశ్ త్వరలో ఖాళీ అవ్వనున్న రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి శుక్రవారం నోటిఫికేషన్ విడుదల అయింది. ఈ మేరకు అసెంబ్లీ కార్యదర్శి, రిటర్నింగ్‌ అధికారి నోటిఫికేషన్‌ విడుదల చేశారు. ఇవాళ ఉదయం 11 గంటల నుంచి మార్చి 13 వరకు నామినేషన్ దాఖలు చేసుకోవచ్చు.. మార్చి 16 న నామినేషన్ పత్రాలను పరిశీలిస్తారు. మార్చి 18లోగా నామినేషన్లను ఉపసంహరించుకోనే అవకాశం ఉంది. మార్చి 26న ఉదయం నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఓటింగ్ జరుగుతుంది.

నామినేషన్లకు కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల అభ్యర్థుల నామినేషన్ కోసం 8 మంది ఎమ్మెల్యేలు ప్రతిపాదకులుగా ఉండాల్సి ఉంది. స్వతంత్రులకు అయితే 10 మంది ఎమ్మెల్యేలను ప్రతిపాదకులుగా చేర్చాలి. ఏపీ నుంచి రాజ్యసభకు ప్రాతినిథ్యం వహిస్తున్న మహ్మద్ అలీ ఖాన్, టీ సుబ్బిరామిరెడ్డి, కే కేశవరావు, తోట సీతారామ లక్ష్మిల పదవీ కాలం ముగియడంతో వారి స్థానంలో కొత్తగా నలుగురికి అవకాశం దక్కనుంది. అయితే ఇప్పటికే ఒక సీటును రిలయన్స్ ప్రముఖుడు పరిమళ నత్వానికి రిజర్వ్ చేసినట్టు వైసీపీ వర్గాలు దృవీకరిస్తున్నాయి.

Tags

Next Story