నాగర్ కర్నూల్‌లో కీచక టీచర్‌కి దేహశుద్ధి చేసిన స్థానికులు

చిన్నారులపై అఘాయిత్యానికి పాల్పడుతున్న ఓ ప్రయివేటు ఉపాధ్యాయుడికి గ్రామస్థులు దేశశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. నాగర్ కర్నూలు జిల్లా తెల్కపల్లి మండలం పెద్దూరుకు చెందిన 25 ఏళ్ల శరత్ ఆరేళ్లుగా వనపర్తి జిల్లా గోపాల్ పేట మండలం ఏదుట్లలో నివసిస్తున్నాడు. అక్కడే ఓ ప్రయివేటు స్కూల్ లో టీచర్ గా పనిచేస్తున్నాడు.

ఈ క్రమంలో గురుకుల ప్రవేశాలకు 4వ తరగతి విద్యార్థులకు శిక్షణ ఇచ్చే శరత్.. బాలికలు సందేహాలు అడిగితే ఇంటికి రమ్మనేవాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో వారితో అసభ్యంగా ప్రవర్తించేవాడు. విషయం ఎవరీకి చెప్పొద్దని భయపెట్టేవాడు. అయితే ఓ బాలికకు తీవ్ర రక్తస్రావం కావడంతో శరత్ ఆకృత్యాలు వెలుగుచూశాయి.

బాలికకు తీవ్ర రక్తస్రావం కావడంతో భయపడిన తల్లిదండ్రులు డాక్టర్ ను సంప్రదించారు. బాలికను పరీక్షించిన డాక్టర్ అత్యాచారం జరిగిందని చెప్పడంతో బాలికను విచారించారు. తనపై ఉపాధ్యాయుడు అత్యాచారం చేశాడని బాలిక చెప్పడంతో గ్రామస్తులంతా కలిసి టీచర్ ను ప్రశ్నించారు.

దీంతో మద్యం మత్తులో తప్పుచేశానని ఒప్పుకున్నాడు కీచక టీచర్. ఆగ్రహించిన గ్రామస్తులు కామాంధుడు శరత్ కు దేహశుద్ధి చేసి.. పోలీసులకు అప్పగించారు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేస్తామని సీఐ సూర్యనాయక్ తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story