కామారెడ్డి జిల్లాలో విషాదం.. అనుమానాస్పద స్థితిలో ముగ్గురు అక్కాచెల్లెళ్లు మృతి

కామారెడ్డి జిల్లాలో విషాదం.. అనుమానాస్పద స్థితిలో ముగ్గురు అక్కాచెల్లెళ్లు మృతి

కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం తాడ్కోల్‌లో విషాదం చోటు చేసుకుంది. రాజారామ్‌ దుబ్బా చెరువులోపడి ముగ్గురు అక్కాచెల్లెళ్లు.. అనుమానాస్పద రీతిలో మృతి చెందారు. ఈ ఘటనలో 10 ఏళ్ల అఫీయా, 9 ఏళ్ల మహీన్‌, 7ఏళ్ల జియా చెరువులో జలసమాధి అయ్యారు. కుటుంబ కలహాలతో తండ్రి ఫయాజే.. ముగ్గురు కూతుళ్లను చెరువులో తోసి హత్య చేసినట్టు గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తండ్రి ఫయాజ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. చిన్నారుల మృతి.. స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.

Tags

Read MoreRead Less
Next Story