అన్ని రంగాల్లో మహిళలు ముందుండాలి: వాసిరెడ్డి పద్మ
BY TV5 Telugu6 March 2020 5:10 PM GMT

X
TV5 Telugu6 March 2020 5:10 PM GMT
మహిళలు అన్ని రంగాల్లోనూ ముందుండాలన్నారు రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ. మహిళా సాధికారతే ధ్యేయంగా శ్రీకోనేరు వెంకటేశ్వరరావు మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎన్నో రకాలుగా సేవలందిస్తోందన్నారు. అధునాతన హంగులతో రాజమహేంద్రవరం డైమండ్ పార్క్‌లో శ్రీకోనేరు సీతామహాలక్ష్మి మహిళల ఉచిత కుట్టు శిక్షణా కేంద్రాన్ని ఆమె ప్రారంభించారు. మహిళలకు చేయూతనిచ్చే విధంగా ఉచిత కుట్టు శిక్షణ కేంద్రం ఏర్పాటు చేయడంతో పాటు అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున ప్రారంభించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో రాజమండ్రి వైసీపీ కోఆర్డినేటర్ ఘాకోళపు శివరామ సుబ్రమణ్యం, జగపతి, ట్రస్ట్ ప్రతినిధులు పాల్గొన్నారు.
Next Story