మిర్చి రైతన్నకు కన్నీరు మిగిల్చిన అకాలవర్షం

మిర్చి రైతన్నకు కన్నీరు మిగిల్చిన అకాలవర్షం

అకాల వర్షం రైతులను కోలుకోలేని విధంగా దెబ్బతీసింది. ఖమ్మంలో కురిసిన భారీ వర్షానికి మిర్చి మార్కెట్ తడిసి ముద్దయింది. కొనుగోళ్లు జరుగుతున్న సమయంలో పడిన వర్షంతో అన్నదాత కుదేలయ్యాడు. మార్కెట్‌లో కనీసం ప్లాస్టిక్ పట్టాలు కూడా అందుబాటులో లేకపోవడంతో చూస్తుండగానే మిర్చి పంట మొత్తం నీళ్లపాలైంది. ఇప్పటికే కరోనా దెబ్బకు మిర్చికి డిమాండ్ తగ్గిపోయి రేటు ఒక్కసారిగా పడిపోయింది. ఈ సమయంలో పడిన అకాల వర్షం రైతుని మరింత కష్టాలపాలు చేసింది. తడిసిన మిర్చిని ప్రభుత్వమే కొనుగోలు చేసి ఆదుకోవాలని రైతులు డిమాండ్ చేశారు.

Tags

Read MoreRead Less
Next Story