ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్

స్థానిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అంతా పని చేయాలని టీడీపీ నాయకులు, ప్రజా ప్రతినిధులకు చంద్రబాబు పిలుపు ఇచ్చారు. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ టెలికాన్ఫరెన్స్‌లో అన్ని మండలాల టీడీపీ నాయకులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. స్థానిక ఎన్నికలకు తెలుగుదేశం పార్టీ సిద్దంగా ఉండాలని చంద్రబాబు సూచించారు. 38 ఏళ్ల టీడీపీ చరిత్రలో ఎన్నో ఎన్నికలు సమర్ధంగా ఎదుర్కొన్నామని.. కానీ ఈ సారి ఎన్నికలను ఎదుర్కోనేందుకు అంతా విరోచితంగా పోరాడాలన్నారు. వైసీపీ దాడులు, దౌర్జన్యాలను ధైర్యంగా ఎదుర్కోవాలని కేడర్‌కు సూచించారు.

వైసీపీ ఆరాచకాలపై న్యాయ పోరాటం చేసి.. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి అన్నారు. ఒక్క అవకాశం అంటూ అధికారంలోకి వచ్చిన జగన్‌.. ఉన్నవన్నీ ఊడగొట్టారని.. పేదల సంక్షేమ పథకాలన్నీ రద్దు చేశారని ఆరోపించారు. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ గెలిస్తే ఇక ఏమీ మిగల్చరని ఆవేదన వ్యక్తం చేశారు. ఓడిపోతారనే భయంతోనే మంత్రుల ఉద్యోగాలు పీకేస్తానని జగన్ బెదిరింపులు చేస్తున్నారని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. అమరావతిలో ఆడబిడ్డల పోరాటం స్ఫూర్తితో టీడీపీ నేతలంతా పోరాడాలని పిలుపు ఇచ్చారు.

Tags

Next Story