అందుకే.. ప్రజలు ఆపార్టీలకు కర్రకాల్చి వాతపెట్టారు: కేసీఆర్

అందుకే.. ప్రజలు ఆపార్టీలకు కర్రకాల్చి వాతపెట్టారు: కేసీఆర్

అసెంబ్లీలోతెలంగాణ ఉద్యమ పరిణామాలను వివరించిన సీఎం కేసీఆర్ కాంగ్రెస్, బీజేపీ తీరుపై మండిపడ్డారు. ఉద్యమాన్ని నీరుగార్చడానికి అన్ని ప్రయత్నాలు చేశారని ఆరోపించారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా కాంగ్రెస్, బీజేపీ కుట్రలు ఆగలేదన్నారు. మొదటి నుంచే ఎదురుదాడి మొదలుపెట్టారని అన్నారు. అందుకే ఈ రెండు పార్టీలకు ప్రజలు కర్రకాల్చి వాతపెట్టారని చెప్పారు కేసీఆర్.

ఏ ఎన్నికలు వచ్చినా.. ప్రజలు టీఆర్ఎస్‌కే పట్టం కట్టారని అన్నారు కేసీఆర్. ఈ ఓటములపై కాంగ్రెస్ ఆత్మపరిశీలన చేసుకోవాలని చెప్పారు. కాంగ్రెస్, బీజేపీ లోపాయికారి ఒప్పందాలను లోకమంతా చూసిందని విమర్శించారు. ఎన్నికల్లో ఓడిపోతే ఈవీఎంలపై నెపం నెట్టడం ప్రతిపక్షాలకు అలవాటైపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈవీఎంలైనా, బ్యాలెట్ అయినా గెలుపు TRSదే అని స్పష్టం చేశారు సీఎం కేసీఆర్.

Tags

Read MoreRead Less
Next Story