స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల

స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల

ఆంధ్రప్రదేశ్‌ స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైంది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ ఎన్‌.రమేష్‌కుమార్‌ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించారు. మొత్తం మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహస్తామని ఆయన ప్రకటించారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు ఒక విడతలో, పంచాయతీ ఎన్నికలను రెండు విడతల్లో, ఒకే దశలో మున్సిపల్‌ ఎన్నికలు జరగనున్నాయని వివరించారు. ఈనెల 21న జడ్పీటీసీ,ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించి ఫలితాలను 24న ప్రకటిస్తామన్నారు.

ఈ నెల 23న మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌ జరిపుతామన్నారు. దీనికి సంబంధించి మార్చి 9న నోటిఫికేషన్‌ విడుదల కానుంది. మార్చి 11 నుంచి 13వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరిస్తారు.. మార్చి 14వ తేదీనా నామినేషన్లను పరిశీలించనున్నారు. మార్చి 16 నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదిగా ప్రకటించారు.. మార్చి 23 మున్సిపల్‌ ఎన్నికలు నిర్వహించి.. 27వ తేదీన ఫలితాలు ప్రకటించనున్నారు.

పంచాయతీ ఎన్నికలను రెండు దశల్లో నిర్వహించనున్నారు. ఈ నెల 27న తొలివిడుత పంచాయతీ ఎన్నికలు, 29న రెండో విడత పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ రెండు దశలకు సంబంధించి మార్చి 17, 19 తేదీల్లో నోటిఫికేషన్ విడుదల చేస్తారు.. మార్చి 20, 22 తేదీల్లో నామినేషన్లను పరిశీలిస్తారు.. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన ఆర్డినెన్స్‌ ద్వారా ఈ షెడ్యూల్డ్‌ను విడుదల చేశామన్నారు ఎన్నికల కమిషనర్‌.. అలాగే ఎన్నికల కోడ్‌ తక్షణమే అమల్లోకి వస్తుందని స్పష్టం చేశారు.

Tags

Next Story