ఆంధ్రప్రదేశ్

లేపాక్షి ఉత్సవాల్లో ఎమ్మెల్యే బాలకృష్ణకు దక్కని ప్రాధాన్యత

లేపాక్షి ఉత్సవాల్లో ఎమ్మెల్యే బాలకృష్ణకు దక్కని ప్రాధాన్యత
X

లేపాక్షి ఉత్సవం.. నందమూరి బాలకృష్ణ.. ఈ రెండింటినీ విడదీసి చూడలేం. లేపాక్షి ఉత్సవాలు అంటేనే స్థానిక ఎమ్మెల్యే బాలకృష్ణ పేరు గుర్తుకురావడం ఖాయం. ఆ ఉత్సవాల్లో బాలయ్య చేసే హడావుడి అంతా ఇంతా కాదు. లేపాక్షి ఉత్సవాలను అద్భుతంగా నిర్వహించి.. అంతర్జాతీయ గుర్తింపు తీసుకొచ్చారు బాలకృష్ణ. కానీ, ఈసారి ఉత్సవాల్లు ఆయన పేరు వినిపించడం లేదు. కనీసం స్థానిక ఎమ్మెల్యేగా కూడా గుర్తించడం లేదు.

రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న లేపాక్షి ఉత్సవాల్లో స్థానిక ఎమ్మెల్యే బాలకృష్ణకు ప్రాధాన్యత కల్పించకపోవడం చర్చనీయాంశమైంది. ఎక్కడైనా ప్రభుత్వ కార్యక్రమాలు చేపడితే.. పార్టీలను పక్కన పెట్టి ప్రొటోకాల్ పాటించాలి. అయితే, శని, ఆదివారాల్లో లేపాక్షిలో నిర్వహించే ఉత్సవాల్లో స్థానిక ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రస్తావన వినిపించడం లేదు. కేవలం ఆహ్వాన పత్రికలో పేరు తప్ప, సభావేదిక, ఆహ్వాన తోరణాలు, ఫ్లెక్సీల్లో కూడా బాలకృష్ణ ఫొటో కనిపించడం లేదు.

లేపాక్షిని పర్యాటకంగా అభివృద్ధి చేయడంతో పాటు.. దాని ఖ్యాతి నలుదిశలా ప్రాచుర్యం పొందేలా రెండుసార్లు అత్యంత వైభవంగా ఉత్సవాలు నిర్వహించారు బాలకృష్ణ. అలాంటి ఎమ్మెల్యే విషయంలో వైసీపీ ప్రభుత్వం కనీసం ప్రొటోకాల్ పాటించకపోవడమేంటని స్థానికులు చర్చించుకుంటున్నారు. ఎమ్మెల్సీ మహమ్మద్‌ ఇక్బాల్ ఫొటోలు కూడా కనిపించకపోవడం చర్చనీయాంశంగా మారింది.

Next Story

RELATED STORIES