ఏపీలో బీజేపీ, జనసేన స్నేహగీతం.. స్థానిక ఎన్నికల్లో కలిసికట్టుగా ఫైట్
అసెంబ్లీ ఎన్నికల్లో సింగిల్ గా బరిలోకి దిగిన జనసేనా.. ఎన్నికల తర్వాత బీజేపీతో స్నేహగీతం పాడింది. ఢిల్లీ వెళ్లిన పవన్ అమిత్ షాతో భేటీ తర్వాత దోస్తీ మరింత కుదురుకుంది. దీంతో కొన్నాళ్లుగా ఫ్రెండ్లీగా ఉంటున్న జనసేన, బీజేపీ ఇప్పుడు ఎలక్షన్ బరిలోనూ కలిసి పోటీ చేసేందుకు సన్నద్ధం అవుతున్నాయి.
స్థానిక ఎన్నికల హడావుడిలో ఉన్న బీజేపీ రాష్ట్ర నాయకత్వంతో కూడా టెలి కాన్ఫరెన్స్ లో చర్చించారు ఢిల్లీ లీడర్స్. అనంతరం ఎన్నికల కసరత్తుపై విజయవాడలోనూ చర్చించాలని నిర్ణయించారు. వచ్చే ఆదివారం విజయవాడలో సమావేశమై జనసేన, బీజేపీ రాష్ట్ర నాయకులు స్థానిక ఎన్నికల్లో పోటీ స్థానాలపై ఓ అవగాహనకు రానున్నారు.
ఆదివారం జరగబోయే సమావేశం తర్వాత బీజేపీ, జనసేన స్టేట్ ఎక్కడెక్కడ పోటీ చేయనున్నారనేది క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలో కూడా ఖరారు కానుంది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com