మహాత్మాగాంధీ యూనివర్సిటీలో కీచక అవతారం ఎత్తిన గురువు

మహాత్మాగాంధీ యూనివర్సిటీలో కీచక అవతారం ఎత్తిన గురువు

కంచె చేను మేసింది. విద్యాబుద్ధులు నేర్పాల్సిన గురువే కీచక అవతారం ఎత్తాడు. మార్కుల పేరుతో విద్యార్థినులను లైంగిక వేధింపులకు గురిచేశాడు. నల్గొండ జిల్లా మహాత్మాగాంధీ యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీలో వైస్‌ ప్రిన్సిపల్ పునీత్ కుమార్ కీచకపర్వం కలకలం రేపుతోంది. అతడిపై ఇప్పటికే యూనివర్సిటీ రిజిస్ట్రార్‌కు ఫిర్యాదు చేశారు విద్యార్థినిలు. అయినా లాభం లేకపోవడంతో జిల్లా ఎస్పీ రంగనాథ్‌ను కలిశారు. పోలీసులు పునీత్‌కుమార్‌ని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. అటు విద్యార్థి సంఘాలు యూనివర్సిటీ బంద్‌కు పిలుపునిచ్చాయి.

Tags

Read MoreRead Less
Next Story