శ్రీకాకుళం జిల్లాలో గందరగోళంగా మారిన భూ సేకరణ

శ్రీకాకుళం జిల్లాలో గందరగోళంగా మారిన భూ సేకరణ

ఏపీలో భూ సేకరణ గందరగోళంగా మారింది. శ్రీకాకుళం జిల్లాలో వజ్రకొత్తూరు మండలం రాజాం పంచాయతీ పోతయ్యపేట గ్రామస్తులు ఆందోళనకు దిగారు. తాము సాగు చేసుకుంటున్న భమూలు లాక్కోవద్దని అధికారులను అడ్డుకున్నారు. ఉగాది నాటికి పేద ప్రజలకు పట్టాలిచ్చే క్రమంలో దశాబద్దకాలంగా పట్టాలు పొంది సాగుచేస్తున్న తమ భూములను తీసుకుంటే ఎలా అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వం పట్టాలు ఇస్తే.. ఇప్పటి ప్రభుత్వం నకిలీ పట్టాలు అంటే ఎలా అని ప్రశ్నిస్తున్నారు.

మరోవైపు శ్రీకాకుళం జిల్లా రేగిడి మండలం తునివాడ గ్రామంలో దళితుల భూములను అగ్రకులాల వారికి కేటాయించడంపై ఆందోళనకు దిగారు. రెవెన్యూ అధికారులను అడ్డుకొని.. నిరసనలు చేపట్టారు. భారీగా పోలీసులు మోహరించడంతో ఇరు వర్గాలకు మధ్య తోపులాట జరిగి పరిస్థితి ఉద్రిక్తంగా కనిపించింది. ఈ తోపులాటలో 52 ఏళ్ల మురళీ కృష్ణ అనే వ్యక్తి కుప్పకూలి మృతిచెందాడు.

Tags

Next Story