యెస్ బ్యాంకు సంక్షోభంపై స్పందించిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్

X
By - TV5 Telugu |7 March 2020 1:32 AM IST
యెస్ బ్యాంకు సంక్షోభంపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు. ఖాతాదారులకు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. యెస్ బ్యాంకు కస్టమర్ల సొమ్ము సురక్షితంగా ఉంటుందని హామీ ఇచ్చారు. 50 వేల నగదు ఉపసంహరణ పరిమితి తాత్కాలికమేనని అన్నారు. ఈ అంశంపై ఆర్బీఐ గవర్నర్ తో మాట్లాడానని.. సత్వర పరిష్కారం దిశగా ఆర్బీఐ కృషి చేస్తోందని తెలిపారు. ఈ విషయంలో ఆర్బీఐ, కేంద్ర ప్రభుత్వం కలిసి పనిచేస్తుందని అన్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com