యాదాద్రి బ్రహ్మోత్సవాలు.. భక్తులకు కనువిందు చేసిన పుష్పయాగం

యాదాద్రి బ్రహ్మోత్సవాలు.. భక్తులకు కనువిందు చేసిన పుష్పయాగం

యాదాద్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించిన పుష్పయాగం భక్తులకు కనువిందు చేసింది. వజ్ర వైడూర్యాలు, వివిధ రకాల పుష్పాలతో అలంకరించిన లక్ష్మీ సమేత నరసింహుడు నయన మనోహరంగా దర్శనమిచ్చారు. అలాగే వార్షిక బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించిన ముక్కోటి దేవతలకు మహా పూర్ణాహుతితో హవిస్సులు అందజేసి... మేళ తాళాలతో ఉద్వాసన కార్యక్రమాన్ని నిర్వహించారు.

అంతకుముందు బాలాలయంలో స్వామివారి చక్రస్నాన ఘట్టం వైభవంగా జరిగింది. కొండపైన ఉన్న పుష్కరిణి నుంచి జలాన్ని తీసుకొచ్చి.. వెండి గంగాళంలో పోసి చక్రస్నానం నిర్వహించారు. అనంతరం ఆ పుణ్యజలాన్ని అందరిపై చల్లి తరింపజేశారు.

Tags

Read MoreRead Less
Next Story