ప్రధాని మోదీ దృష్టికి అమరావతి రైతులపై అక్రమ కేసుల అంశం
By - TV5 Telugu |7 March 2020 7:56 PM GMT
అమరావతి రైతులపై అక్రమ కేసులపై న్యాయ పోరాటం చేస్తున్నారు జేఏసీ నేతలు. ఈ విషయంపై ప్రధాని నరేంద్ర మోదీ దృష్టికి తీసుకెళ్లారు. గత మూడు నెలలుగా రైతులపై అక్రమ కేసులు పెట్టి బెదిరిస్తున్నారని ఫిర్యాదు చేశారు అమరావతి జేఏసీ గౌరవ అధ్యక్షుడు ప్రొఫెసర్ డాక్టర్ జీవీఆర్‌శాస్త్రి. ఈ సందర్భంగా కేసులకు సంబంధించిన పూర్తి వివరాలు జీవీఆర్ శాస్త్రిని కోరింది ప్రధాన మంత్రి కార్యాలయం. ఇప్పటికే జాతీయ మానవ హక్కుల సంఘం, మహిళా కమిషన్‌లో ఫిర్యాదులు చేయగా.. అటు అమ్నెస్టీ ఇంటర్నేషన్‌లోనూ న్యాయవాది కావేటి శ్రీనివాస్ ఫిర్యాదు చేశారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com