ఎండైనా, వానైనా ఉద్యమం కొనసాగింపులో వెనక్కి తగ్గేదే లేదు : అమరావతి రైతులు

X
ఎండైనా, వానైనా ఉద్యమం కొనసాగింపులో వెనక్కి తగ్గేదే లేదంటున్నారు రాజధాని రైతులు, మహిళలు. ఇవాళ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా 29 గ్రామాల్లోని మహిళలంతా వేడుకలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. తమ స్వేచ్ఛకు సంకెళ్లు వేస్తూ, అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్న ప్రభుత్వ తీరుకు నిరసనగానే ఇలా చేస్తున్నారు. ఇక వెలగపూడిలో మహిళలు 24 గంటల దీక్ష చేపట్టనున్నారు.. 151 మంది మహిళలు 12 గంటల దీక్ష చేయనున్నారు. మందడం, పెనుమాక, ఎర్రబాలెం, కృష్ణాయపాలెం, ఉండవల్లి, రాయపూడి, నేలపాడు, నవులూరు, పెదపరిమి, తాడికొండ అడ్డరోడ్డు, నిడమర్రులో నిరసన దీక్షలు కొనసాగుతున్నాయి.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
