పార్టీ మీటింగ్‌లో కన్నీరు పెట్టుకున్న ఏపీ డిప్యూటీ సీఎం పాముల పుష్పశ్రీవాణి
By - TV5 Telugu |7 March 2020 7:38 PM GMT
ఏపీ డిప్యూటీ సీఎం పాముల పుష్పశ్రీవాణి కన్నీరుపెట్టారు. పార్టీ అగ్రనేతలు కూర్చున్న వేదికపై ఉన్నట్టుండి ఆమె కన్నీటిపర్యంతం కావడం చర్చనీయాంశమైంది. విజయనగరంలో జరిగిన వైసీపీ విస్తృతస్థాయి సమావేశంలో ఈ ఘటన జరిగింది. మొదట పుష్పశ్రీవాణి భర్త పరీక్షిత్ రాజును వేదికపైకి పిలువలేదు. మంత్రులు, ఎమ్మెల్యేలతోపాటు మరికొంత మంది పార్టీ నేతలను మాత్రమే వేదికపైకి ఆహ్వానించారు. దీంతో తీవ్ర ఆవేదనకు గురైన పుష్పశ్రీవాణి.. ఈ విషయాన్ని పక్కనే ఉన్న విజయసాయిరెడ్డికి చెప్పుకొని కన్నీరు పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత విజయసాయిరెడ్డి సూచన మేరకు తిరిగి పరీక్షిత్ రాజును వేదికపైకి ఆహ్వానించినట్లు తెలుస్తోంది.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com