8 March 2020 12:39 PM GMT

Home
 / 
అంతర్జాతీయం / చైనాలోని క్వాంజాలో...

చైనాలోని క్వాంజాలో ఘోరం

చైనాలోని క్వాంజాలో ఘోరం
X

చైనాలోని క్వాంజాలో ఘోరం జరిగింది. కరోనా వైరస్ నుంచి కాపాడటానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్న సమయంలో కష్టాలు మరో రూపంలో వచ్చాయి. కరోనా వైరస్ రోగులను ప్రత్యేకంగా ఉంచి, చికిత్స చేసేందుకు ఉపయోగించిన హోటల్ కుప్పకూలిపోవడంతో దాదాపు 70 మంది చిక్కుకున్నారు. ఇప్పటివరకు 34 మందిని ఈ శిథిలాల నుంచి బయటకు తీయగలిగారు. 2018 జూన్‌లో ప్రారంభించిన ఈ హోటల్‌లో 80 గదులు ఉన్నాయి. కరోనా వైరస్ విజృంభించిన నేపథ్యంలో అనుమానిత రోగులను ఇక్కడ ఉంచి, చికిత్స చేస్తున్నారు.

అటు వూహాన్‌లో ఆవిర్భవించిన కరోనా రోజురోజుకూ తన ప్రభావాన్ని విస్తరించుకుంటూ పోతోంది. అగ్రరాజ్యాలు, అభివృద్ధిలో దూసుకుపోతున్న దేశాలు, పేద రాజ్యాలు అన్న తేడా ఆ వైరస్‌కు లేనే లే దు. సరిహద్దులు మూసివేసినా, రాకపోకలు నిలిపివేసినా కరోనా రాకకుండా ఆపలేకపోతున్నారు. మొదట చైనాకే పరిమితమైన ఆ వైరస్, ఇప్పుడు ఖండాలు దాటిపోయింది. వూహాన్‌ ప్రజలను నరక యాతనకు గురి చేసిన ఆ వ్యాధి ఇప్పుడు ఏకంగా 90 దేశాలకు విస్తరించింది. ప్రపంచవ్యాప్తంగా 90 దేశాల కరోనా వైరస్ బారిన పడ్డాయి. సుమారు 3 వేల 5 వందల మంది ప్రాణాలు కోల్పోయారు.

దాదాపు లక్షన్నర మంది ప్రజలు బాధితులయ్యారు. కోట్లాది మంది ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. మరికొన్ని కోట్ల మంది వైరస్ భయంతో ఆస్పత్రుల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు.

అమెరికా వణికిపోతోంది. కరోనా ప్రభావాన్ని చూసి ఝడుసుకుంటోంది. అగ్రరాజ్యమే ఐనప్పటికీ ఆ చిన్న సూక్ష్మజీవిని అదుపు చేయడానికి నానా తంటాలు పడుతోంది. ఈ లోపే ప్రాణాలు గాలిలో కలసిపోతున్నాయి. రోజుకు ఒకరిద్దరు మృతి చెందుతున్నారు. మొత్తంగా ఇప్పటి వరకు 15 మంది ప్రాణాలు కోల్పోయారు. న్యూయార్క్, ఫ్లోరిడా, కాలిఫోర్నియా, టెన్నెస్సీ తదితర ప్రాంతా లు కరోనా భయంతో గిజగజలాడిపోతున్నాయి. కరోనాపై భయపడాల్సిన అవసరమే లేదని ట్రంప్ ప్రభుత్వం చెబుతున్నప్పటికీ ప్రజల్లో మాత్రం ఆందోళన తగ్గడం లేదు. కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండడంతో అమెరికన్లు అల్లాడిపోతున్నారు. తమకు కూడా కరోనా సోకిందేమో అన్న అనుమానంతో ఆస్పత్రులకు వెళ్లి టెస్టులు చేయించుకుంటున్నారు. ఏ వైరస్సూ సోకలేదని డాక్టర్లు చెబితే అప్పుడు రిలీఫ్ ఫీలవుతున్నారు.

(SPOT)

ఐరోపా ఖండాన్ని కరోనా షేక్ చేస్తోంది. యూరోపియన్ కంట్రీస్‌ కరోనా గుప్పిట్లో చిక్కుకొని విలవిలలాడుతున్నాయి. ఇటలీ, బ్రిటన్, ఫ్రాన్స్, స్పెయిన్, నెదర్లాండ్స్, జర్మనీలలో వైరస్ ప్రభావం ఎక్కు వగా ఉంది. మొత్తంగా 30 యూరోపియన్ దేశాల్లో కరోనా ప్రభావం ఉంది. ఇందులో 10 దేశాల్లో వైరస్ భయంకరంగా ఎఫెక్ట్ చూపిస్తోంది. ప్రతి దేశంలో కనీసం 100 కేసులు నమోదవుతున్నాయి. ఒక్క ఇటలీలోనే దాదాపు 2 వందల మంది చనిపోయారు. 5 వేల మంది బాధితులయ్యారు. బ్రిటన్‌లో ఇద్దరు మృతి చెందగా సుమారు 170 కేసులు నమోదయ్యాయి. ఫ్రాన్స్‌లో ఓ ఎంపీకే కరోనా వైరస్ సోకింది. మొత్తంగా ఐరోపా ఖండంలో 7, 500 కరోనా కేసులు నమోదయ్యాయి.

గల్ఫ్ దేశాలు, ఇస్లామిక్ కంట్రీస్‌లలోనూ వైరస్ విజృంభిస్తోంది. ఇరాన్, ఇరాక్, కువైట్, ఒమన్, సౌదీ అరేబియా, దుబయ్, యూఏఈలలో వైరస్ ప్రభావం పెరుగుతోంది. ముఖ్యంగా ఇరాన్‌లో పరిస్థితి దారుణంగా ఉంది. ఒక్క ప్రావిన్స్ మినహా దేశం మొత్తాన్ని కరోనా ఆక్రమించింది. ఓ ఎంపీకి కూడా ఇన్ఫెక్షన్ వచ్చింది. దేశ ఉపాధ్యక్షుడు కూడా వైరస్ బారిన పడ్డారు. ఇక్కడ 124 మంది చనిపోయా రని ప్రభుత్వమే ప్రకటించింది. ఐతే మృతుల సంఖ్య 3 వందలు దాటిందని అంతర్జాతీ య మీడియా అంటోంది. ఇరాక్‌లోనూ వైరస్ ప్రభావం మొదలైంది. కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. దాంతో ఇతర గల్ఫ్ దేశాలు అప్రమత్తమయ్యాయి. సరిహద్దులు మూసివేసి రాకపోకలు నిలిపివేశారు. ప్రజల ప్రయాణాలపైనా ఆంక్షలు విధించారు. ప్రఖ్యాత మక్కా పర్యటనపై కూడా వైరస్ ప్రభావం పడింది. మక్కా సందర్శనకు వచ్చే యాత్రికులకు వీసాలు నిలిపివేస్తున్నారు.

ఆసియా ఖండంలో వైరస్ ప్రభావం పెద్దగా కనిపించడం లేదు. చైనా, దక్షిణ కొరియాల్లోనే వైరస్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉంది. సౌత్ కొరియాలో ఏకంగా 7100 కరోనా కేసులు నమోదయ్యాయి. దాంతో ప్రజ లు ప్యానిక్ అవుతున్నారు. మాస్క్‌లు, వైద్య పరికరాల కొరత సమస్యను మరింత జఠిలం చేస్తోంది. ఆస్పత్రుల్లో తగినంత బెడ్స్ లేకపోవడంతో పరిస్థితి దారుణంగా మారింది. వైరస్‌ను కట్టడి చేయడాని కి దేశవ్యాప్తంగా ఆంక్షలు విధించారు. దుకాణాలు మూతపడ్డాయి. కంపెనీలను క్లోజ్ చేశారు. వైరస్‌ సోకిన బాధితులు, వైరస్ లక్షణాలున్న అనుమానితులను ఇళ్లకే పరిమితం చేశారు. ఇక, ఫిలిప్పీన్స్, థాయ్‌లాండ్, హాంకాంగ్, జపాన్, సింగపూర్, నేపాల్, భూటాన్‌, ఆఫ్ఘనిస్థాన్, పాకిస్థాన్‌లలో విస్తరించడానికి వైరస్ తెగ ప్రయత్నిస్తోంది. ఐతే, ఫిలిప్పీన్స్, హాంకాంగ్, జపాన్‌లలో మాత్రమే వైరస్ ఆటలు సాగుతున్నాయి. ఫిలిప్పీన్స్‌లో మృతులు, బాధితుల సంఖ్య పెరగడంతో దేశవ్యాప్తంగా పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ విధించారు. జపాన్‌లో మొదట తీవ్రంగా ప్రభావం చూపిన వైరస్ ఇప్పుడు కాస్త తగ్గుముఖం పట్టింది. ఐనప్పటికీ ప్రజలపై నిషేధాజ్ఞలు కొనసాగిస్తున్నారు.

Next Story