స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసిలకు 34%పైగా స్థానాలు కేటాయించాలని చంద్రబాబు నిర్ణయం

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసిలకు 34%పైగా స్థానాలు కేటాయించాలని చంద్రబాబు నిర్ణయం

స్థానిక ఎన్నికల పర్యవేక్షణ కమిటీలతో టీడీపీ అధినేత చంద్రబాబు భేటీ అయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసిలకు 34%పైగా స్థానాలు కేటాయించాలని ఆయన వ్యాఖ్యానించారు. బీసీ సాధికారత అణచివేసేందుకు వైసీపీ ప్రభుత్వం రిజర్వేషన్లను 34%నుంచి 24%కు తగ్గించిందన్నారు. బీసీలు టీడీపీకి అండగా ఉన్నారనే కక్షతో కుట్రకు పాల్పడ్డారని చెప్పారు. బీసీలను వైసీపీ ఎంత అణచాలనుకుంటే అంతకు అంతపైకి లేస్తారన్నారు.

టీడీపీ కల్పించిన రిజర్వేషన్ల వల్లే స్థానిక సంస్థల నుంచి రాష్ట్ర స్థాయికి బీసీ నాయకత్వం ఎదిగిందన్నారు చంద్రబాబు. రిజర్వేషన్లలో కోతపెట్టి బీసీల రాజకీయ పునాదుల ధ్వంసం చేసేందుకు కుట్ర జరుగుతోందని, ఎవరెన్ని పన్నాగాలు పన్నినా బీసీలను అణచివేయడం అసాధ్యమన్నారు చంద్రబాబు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికల్లో బీసీలకు 34% పైగా స్థానాలు కేటాయిస్తామన్నారు. జగన్‌ కుట్రలను తిప్పికొట్టాల్సిన బాధ్యత బీసీ, ఎస్సీ, ఎస్టీ ముస్లిం, మైనారిటీ వర్గాలదేనన్నారు. ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని వైసీపీ అరాచకాలకు అడ్డుకోవాలని సూచించారు చంద్రబాబు.

Tags

Next Story